Feb 23,2021 09:50

ప్రకాశం (గిద్దలూరు) : గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో కర్నూలు నుండి విజయవాడకు వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.