
'ఓటీటీ మాధ్యమం అందుబాటులోకి వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దాని కోసం ఒక ప్రణాళిక కూడా రెడీ చేశా. కానీ అప్పుడు సినిమా పరిశ్రమలో నా మాట ఎవరూ పట్టించుకోలేదు. నా ఆలోచనలను అంగీకరించలేదు. ఆ రోజున నన్ను వ్యతిరేకించిన వారందరికీ ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కడి నుంచైనా అన్ని భాషల్లోని సినిమాలు చూసి ఆస్వాదిస్తున్నారు. నేను చిన్న సినిమాలకు పెద్ద అభిమానిని.. కథలు విన్నప్పుడు.. కొన్నింటిలో నటించాలనుకుంటాను.. మరికొన్నింటిని నిర్మించాలను కుంటాను. ప్రస్తుతం కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ఆ కథలకు కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాను. మిగతా విషయాల్లో జోక్యం చేసుకోను' అని కమల్ హాసన్ అంటున్నారు. దుబాయ్ లో జరిగిన 'ఐఫా' అవార్డు వేడుకలో లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు అందుకున్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.