
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : కందుకూరి విద్యాసంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలనని ఎస్ఎఫ్ఐ ప్లీనం డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఐ రాజమహేంద్రవరం జిల్లా ప్లీనం బాబుజగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాలులో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకునే ఉద్యమంలో ఎస్ఎఫ్.ఐ నిరంతరం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని వ్యాపారీకరణ చేసే విధంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిందన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగాన్ని ఎన్ఇపి ద్వారా కేంద్రం ప్రభుత్వం కేంద్రీకరణ దిశగా చేసిందని రాష్ట్రాల హక్కులను హరిస్తుందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తానని చెప్పి ప్రయివేటు, పీజీ కళాశాలలో చదివేవారికి విద్యాదీవెనను నిలిపేసిందన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాజమహేంద్రవరం జిల్లా అధ్యక్షులు బి.పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పోస్టులు భర్తి చేసి, యథావిధంగా కొనసాగించాలి. పార్ట్‌టైమ్ సిబ్బందికి కాంట్రాక్ట్ పద్దతిలో కనీస వేతనం ఇవ్వాలి. విద్యార్థులపై ఫీజుల భారం తగ్గించాలని తీర్మానించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఖాళీగా ఉన్న సుమారు లెక్చలర్ పోస్టులను పర్మినెంట్ పద్ధతిలో భర్తీ చేయాలి. సంక్షేమ హాస్టల్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వమే జీతాలివ్వాలి. ఐదు పోస్టులను ప్రతి హాస్టల్స్‌కు కేటా యించాలన్నారు. జిఒ 77ను రద్దు చేసి అన్ని పీజి కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేయాలన్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఒక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి కోరారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీకి స్థల సేకణకు రావాల్సిన బకాయి నిధులను విడుదల ప్రభుత్వం విడుదల చేయాలి. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను బ్లాక్ గ్రాంట్స్ ద్వారా ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలన్నారు. అనంతరం 18 మందితో రాజమహేంద్రవరం ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా కమిటి ఎన్నుకున్నారు. అధ్యక్షులు బి.పవన్, కార్యదర్శిగా ఎన్.రాజా, ఉపాధ్యక్షులుగా వి.రాంబాబు, టి.రాజేష్, పవన్‌కళ్యాణ్, సహాయ కార్యదర్శులుగా డి.అశోక్, లక్ష్మణ్‌రావ్, ఈశ్వరి కమిటీ సభ్యులుగా పి.రోహిత్, అనిల్, మల్లేష్, సాయికిరణ్, రాజేష్, లోవరాజు, రవి, ఉమాదేవి, సుధీర్, మణి ఎన్నికయ్యారు.