Oct 15,2021 00:00

అవగాహన కల్పిస్తున్న ఎల్‌వి ప్రసాద్‌ కంటి హాస్పిటల్‌ సిబ్బంది

ప్రజాశక్తి- శింగరాయకొండ : మండల పరిధిలోని సోమరాజుపల్లి గ్రామంలో పలుకూరు సమీపంలోని పంటవారి పాలెం వద్ద నున్న ఎల్‌వి.ప్రసాద్‌ కంటి హాస్పిటల్‌ సిబ్బంది ఆధ్వర్యంలో కంటి సంబంధించిన వ్యాధులపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌ కో ఆర్డినేటర్‌ బి.సురేంద్ర బాబు, ఫీల్డ్‌ వర్కర్స్‌ సాయిమణి, సుధీర్‌ మాట్లాడుతూ ప్రజలు కంటి వ్యాధుల పట్ల అశ్రద్ధ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంటిలో శుక్లాలు, పొరల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. తమ వైద్యశాలలో నిరుపేదలకు ఉచితంగా కంటికి సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తాము ఇంటింటికీ తిరిగి కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందించ నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకుడు యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్‌, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.