Oct 19,2021 01:05

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

పాడేరు: ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పాడేరు ఆర్‌టిసి డిఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌టిసి యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్‌ను కాంట్రాక్టర్లు అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు రూ.1500 నుంచి రూ.2500 వరకు తగ్గించి ఇస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కనీస వేతనాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఎపిఎస్‌ ఆర్‌టిసి కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.తులసీరామ్‌, కుమార్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.