Apr 08,2021 08:17

హైదరాబాద్‌ : కన్నడ ప్రముఖ నటి ప్రతిమా దేవి (88) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కన్నడ ఇండిస్టీలో ఎన్నో మరిచిపోలేని సినిమాల్లో నటించారు. కన్నడలో ఆమె నటించిన జగన్మోహిని తొలి వంద రోజుల ఉత్సవాన్ని జరుపుకున్న చిత్రంగా నిలిచింది. జగన్మోహినితోపాటు కృష్ణ లీల, చంచల ఉమరి, శివశరణే నమియక్క, మంగళ సూత్రం వంటి సినిమాలతో ఆమెకు మంచి పేరు వచ్చింది. 2011 లో కర్నాటక ప్రభుత్వం ప్రతిమా దేవిని లైఫ్‌ టైం అవార్డుతో సత్కరించింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త, స్వతంత్ర సమరయోధుడు శంకర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు.
   నటి ప్రతిమా దేవి మృతి పట్ల కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమ ఒక లెజెండరీ నటిని కోల్పోయిందని.. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ సంతాపం ప్రకటించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రతిమా దేవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.