Mar 15,2023 16:08

ప్రజాశక్తి-భట్టిపోలు : బాపట్ల జిల్లా వేమూరు నియోజవర్గం భట్టిపోలు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసుడు మాన్యశ్రీ కాన్షీరామ్ 89వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి బహుజన సమాజ్ పార్టీ వేమూరు నియోజవర్గ ఇన్చార్జి జడ రవీంద్రబాబు ఆధ్వర్యంలో పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగునున్న sc st bc మైనార్టీ 85% ఉన్న పేద వర్గానికి కూడా అధికారం వచ్చింది అని నిరూపించిన గొప్ప మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరామ్ అని తెలిపారు, ప్రతి ఒక్కరూ వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని వారి ఆశయసాధన కోసం కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా BSP కోశ అధికారి దాసరి వెంకటేశ్వరరావు, వేమూరు నియోజవర్గ బిఎస్పి నాయకులు పూరేటి మాణిక్యరావు, మండే పిచ్చయ్య మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.