Oct 03,2022 22:51

 కొడియేరి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న సిపిఎం బృందం

ప్రజాశక్తి - కాకినాడ
సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర కమిటీ మాజీ కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ మతికి సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ సోమవారం నివాళులు అర్పించారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఏ.గపూర్‌ బాలకృష్ణన్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 1953 నవంబర్‌ 16న జన్మించిన కొడియేరి 1970లో పార్టీలో చేరి అంచలంచలుగా పోలిట్‌బ్యూరో సభ్యుని వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారని, విద్యార్థి ఉద్యమంతో రాజకీయ జీవి తాన్ని ప్రారంభించిన ఆయన ఎమర్జెన్సీతో సహా వివిధ సందర్భాలలో జ్కెలు జీవితాన్ని, అజ్ఞాతవాసాన్ని అనుభవిం చారని అన్నారు. కేరళలో అచ్యుతానందన్‌ మంత్రివర్గంలో రాష్ట్ర హోం మంత్రిగా పని చేశారని తెలిపారు. ఆయన మృతి సిపిఎంకు తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు, నాయకులు దువ్వ శేష బాబ్జీ, కె.ఎస్‌. శ్రీనివాస్‌, జి.బేబీ రాణి, కరణం ప్రసాదరావు, కె.వీరబాబు, జుత్తుక శ్రీనివాస్‌, సిహెచ్‌. అజరు కుమార్‌, పి.వీరబాబు, ఎంవిరమణ, కె.సత్తిరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.