
కొలరాడో : అమెరికాలోని కొలరాడో అడవుల్లో పలుచోట్ల దావానలం చెలరేగింది. కొలరాడోలో రెండవ అతిపెద్ద నగరమైన కొలరాడో స్ప్రింగ్స్‌లో 8 ఇళ్లు తగలబడిపోయాయి. దట్టంగా చెలరేగుతున్న పొగ కారణంగా నగర విమానాశ్రయాన్ని మూసివేశారు. వేలాదిమందిని అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొడిగా వును పరిస్థితులు, భారీగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు చాలా వేగంగా ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. గాలులు కూడా వేగంగా వీస్తుండడంతో మొత్తంగా నాలుగుప్రాంతాలకుఈ మంటలు పాకాయి. రాత్రయ్యేసరికి డజన్ల సంఖ్యలో అగిుమాపక యంత్రాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టాయి. గాల్లో 15మీటర్ల ఎత్తు వరకు నీటిని వెదజల్లుతూ మంటలను అర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు వంద అగిుమాపక యంత్రాలు మంటలను అదుపు చేస్తుండగా, 28మంది డిప్యూటీలు, 63మంది పోలీసు అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.