Jul 29,2021 07:41

టోక్యో : తెలుగు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధు విజయ పరంపర కొనసాగిస్తోంది. టోక్యో ఒలంపిక్స్‌లో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫ్రీ క్వార్డర్స్‌లో వరల్డ్‌ 12వ ర్యాంకు, డానిష్‌ సెట్లర్‌ మియా బ్లిచ్‌ఫెల్డ్‌పై సింధు సునాయాసంగా విజయం సాధించింది. 41 నిమిషాల్లోనే ఆట ముగించడం విశేషం. 2-15, 21-13తో బ్లిచ్‌ఫెల్డ్‌పై విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో 4వ సీడ్‌ జపాన్‌కు చెందిన అకానే యమగూచి, 12వ సీడ్‌ కిమ్‌ల మ్యాచ్‌ తర్వాత ఎవరూ గెలుస్తారో వారిని సింధు ఎదుర్కొవలసి వస్తుంది.