Jan 15,2022 17:45

కృష్ణా : అనుమతి లేని కోళ్ల పందాలతో సామాన్యులకు ఇకట్లు తప్పలేదు. కృష్ణా జిల్లాలోని నిర్వహిస్తున్న కోళ్ల పందాల వలన గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు - మచిలీపట్నం - కల్లూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో కోళ్ల పందాలు ప్రయాణికులను కూడా రోడ్డున పడేశాయని భావిస్తున్నారు. రోడ్డు పక్కన పొలాల్లో భారీగా కోడి పందాలు, పేకాట, గుండాటలు నిర్వహిస్తున్నారు. వీటిపై కోట్ల రూపాయిల బెట్టింగ్ జరుగుతుంది. పందెం రాయుళ్ల బరితెగ్గించడంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు తెలుపుతున్నారు.