Jul 29,2021 22:01

మాట్లాడుతున్న డిపిఓ ధనలక్ష్మి


మాట్లాడుతున్న డిపిఓ ధనలక్ష్మి
కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
డిపిఓ ధనలక్ష్మి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాళెం:మండలంలో దామరమడుగు గ్రామంలోని సచివాలయాలను జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి గురువారం సందర్శించారు.సచివాలయం లోని పలు రికార్డులను పరిశీలించారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు. ఫిర్యాదుల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సచివాలయాలను సందర్శిస్తూ వాటి పని తీరును మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సాయంత్రం మూడు నుంచి ఐదు వరకు సచివాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం మండల జిల్లా కేంద్రాలకు వెళ్ళకుండా గ్రామంలోనే పరిష్కరించేలా సిబ్బంది పని చేయాలని చెప్పారు.
కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో కంటోన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్‌ లు విధించాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీవో నరసింహారావు,ఈవోపీఆర్డీ పెంచలశ్యామ్‌, కార్యదర్శి రామ్మోహన్‌ తదితరులున్నారు.