Jan 26,2022 02:18

మాట్లాడుతున్న పార్వతి

ప్రజాశక్తి-పాడేరు: కరోనా థర్డ్‌ వేవ్‌ నివారణ చర్యలపై స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ పార్వతి మాట్లాడుతూ, కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుదాస్‌ మాట్లాడుతూ, విద్యార్థులు మాస్క్‌ ధరించి, వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చిన్నారావు, పాపారావు, రాంబాబు, రావన్‌, లోకేష్‌, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు