Jan 19,2022 11:58

న్యూఢిల్లీ : కోవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా.. పరిహారం ఇవ్వకపోవడంపై ఈ ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న జస్టిస్‌ ఎంఆర్‌షా నేతృత్వంలోని ధర్మాసనం.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. కాగా, డేటాను కోర్టుకు సమర్పించామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ఎందుకు జాప్యం చేశారని, వారే వివరణ ఇవ్వాలని, హాజరయ్యేలా చూడలంటూ ధర్మాసనం పేర్కొంది.