
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, చిన్నపాటి అనుమానం వచ్చినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. కోవిడ్ ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైద్యులను సంప్రదించి అవసరమైన మందులు వాడుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పందన అర్జీలు గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మి శివ జ్యోతి, సిపిఓ భరత్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి ఏ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఇ విద్యాసాగర్, మత్స్య శాఖ జెడి సురేష్, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్ సత్తార్, పౌర సరఫరాల శాఖ డిఎస్‌ఓ విలియమ్స్, డిఎం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.