Mar 02,2021 14:02

అహ్మదాబాద్‌ : భారత క్రికెట్‌ టీం కోచ్‌ రవిశాస్త్రి అహ్మదాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కోవిడ్‌ టీకాను వేయించుకున్నారు. ఆయన కోవిడ్‌ టీకా వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా 'కోవిడ్‌కు వ్యతిరేకంగా పనిచేసిన శాస్త్రవేత్తలకు, వైద్య నిపుణులకు కృతజ్ఞతలు' అని అన్నారు. అలాగే ఆయనకు టీకా వేసిన కాంటాబెన్‌, ఆమె బృందం చూపిన వృత్తి నైపుణ్యానికి మంత్రముగ్ధులైనట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం నరేంద్రమోడీ స్టేడియంలో ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌తో తలపడటానికి సిద్ధమవుతున్న తరుణంలో రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టుతో అహ్మదాబాద్‌లో ఉన్నారు.