May 13,2022 18:39

విశ్వక్‌ సేన్‌ నటించిన 'హిట్‌ : ది ఫస్ట్‌ కేస్‌' హిందీలో రీమేక్‌ అవుతోందన్నది తెలిసిందే. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. తెలుగు మాతృకకి దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో హీరో నాని నిర్మించిన ఈ మూవీని బాలీవుడ్‌లో 'దిల్‌' రాజు, టి సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రాజ్‌కుమార్‌ రావు, 'దంగల్‌' ఫేమ్‌ సాన్యా మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.