
కొత్తిమీర రుచి పెంచడమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలం.
- హార్ట్ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. బ్లడ్ప్రెజర్ను కంట్రోల్ చేస్తుంది. హైబిపితో బాధ పడుతున్న వారికి కొత్తిమీర సలాడ్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది.
- ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ కొత్తిమీర తీసుకోవడం వల్ల క్యాన్సర్, అల్జ్జీమర్స్, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.
- కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్ దృష్టి సమస్యలను నివారిస్తాయి. కంటి మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరొటిన్ వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది. కండ్ల కలక నుండి దూరంగా ఉంచుతుంది.
- నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటి పుళ్లనూ నయం చేస్తుంది.
- ఆస్తియోపొరాసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని కొత్తిమీర తీసుకోమని చెబుతారు. కొత్తిమీరలో ఉండే కాల్షియం, మినరల్స్ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.