Sep 27,2021 16:09

ప్రజాశక్తి- కొత్తవలస
సీతానగరం మండల పరిధిలోగల కొత్త వలస ఆనకట్టపై నుంచి ఉప్పెనలా పొంగి ప్రవహిస్తున్న సువర్ణముఖీ నదీఆనకట్టు దిగువన గల మెట్ట ప్రాంతాల్లో గొర్రెలను కాచుకునే గొర్రెల కాపరి గొర్రెలతో సహా నదీ ప్రవాహం మధ్యన చిక్కుకున్నాడు. అతన్ని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతన్ని చేరుకోవడం అసాధ్యం. కాగా హెలికాఫ్టర్‌ సహాయంతోనే అతన్ని రక్షించగలమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు తీసుకోవాలని కోరారు.