
హీరో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో సుమంత్ సరసన నందితా శ్వేత నటించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన 'కవలుదారి' సినిమాకు ఇది తెలుగు రీమేక్. జి.ధనంజయన్ సమర్పణలో క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై లలిత ధనంజయన్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. హీరోయిన్ సమంత మంగళవారం 'కపటధారి' ట్రైలర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.