
ప్రజాశక్తి-అరకులోయ :జాతీయ క్రైస్తవ దినం సందర్భంగా అరకులోయలో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. నేషనల్ క్రిష్టియన్ బోర్డు (ఎన్సీబీ) రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ కె.సామ్యేల్, రాష్ట్ర కోశాధికారి బిషప్ విజరు దానియేల్ మోడీ, రాష్ట్ర కన్వీనర్ రెవరెండ్ కె.సుదర్శన్‌ల ఆధ్వర్యంలో స్థానిక పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యాన 800 మందికి పైగా క్రైస్తవ విశ్వాసులు, దైవజనులు హాజరయ్యారు. స్థానిక ఆర్డీసీ కాంప్లెక్స్ రోడ్డు లోని క్రైస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ సిబిఎం చర్చి ఫీల్డ్ డైరెక్టర్ వెయిన్ జోసెఫ్, ఆర్సిఎం పాధర్ యేసు పాధం, పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ శెట్టి బాబూరావు; సర్పంచ్ పెట్టెలి దాసు బాబు, ఎంపిటిసి దురియా ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.