Nov 24,2022 19:33

క్రీడాకారున్ని అభినందిస్తున్న ఎమ్మెల్యే శిల్పా

క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందజేత

ప్రజాశక్తి - ఆత్మకూరు

ఈ నెల 25న విజయ నగరంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపికైన ఆత్మకూరు పట్టణానికి చెందిన ఉపేంద్ర అనే క్రీడాకారుడికి శ్రీశైలం ఎమ్మెల్యేశిల్పా చక్రపాణి రెడ్డి ఆర్థిక చేయూతనందించారు. గురువారం పట్టణంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేసి మాట్లాడారు. బాగా ఆడి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గతంలో ఎమ్మెల్యే కుమారుడు శిల్పా కార్తీక్‌ రెడ్డి కూడా ఆర్థిక సహకారం అందించడంతో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచినట్లు క్రీడాకారుడు గుర్తు చేశారు. అనంతరం క్రీడాకారుడిని ఎమ్మెల్యే, క్రీడాకారులు అభినందించారు. కార్యక్రమంలో క్రీడాకారుడు, కౌన్సిలర్‌ సుల్తాన్‌, సీనియర్‌ క్రీడాకారుడు ఎఎండి. రఫీక్‌ తదిత రులు పాల్గొన్నారు.