Dec 07,2022 22:32

ప్రజాశక్తి-నందిగామ 

క్రీడాకారుల ఎదుగుదలకు ప్రభుత్వం అదిక ప్రాధాన్యత ఇస్తుందని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. పట్టణంలోని కె.వి.ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కృష్ణా యూనివర్సిటీ స్థాయి అంతర్‌ కళాశాలల ఉమెన్స్‌ కబడ్డీ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు నందిగామ శాసన సభ్యులు మొండితోక జగన్‌ మోహన్‌రావు బహు మతులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యార్థులు కూడా చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో నడుచుకోవాలని తెలిపారు. కెవిఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాయప్ప ,వాసిరెడ్డి బాబురావు ,పిజికల్‌ డైరెక్టర్‌ వాసిరెడ్డి నాగేశ్వరరావు , అధ్యాపకులు వాసుదేవరావు , స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.