Apr 08,2021 19:56

ప్రజాశక్తి - నరసాపురం
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఉండాలని గ్లోబల్‌ ఇండియా సీనియర్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (జిస్టా) జాతీయ అధ్యక్షుడు చక్రవధానుల చినరెడ్డప్ప ధవేజి అన్నారు. నరసాపురం తొమ్మిదో వార్డులో కానూరి బ్రహ్మాజీరావు టేలర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కానూరి బుజ్జి మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.