Nov 30,2022 23:52

బాల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లా స్థాయి జట్టు ఎంపిక పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

వినుకొండ:మండలంలోని చీకటీగలపాలెం గ్రామం మోడల్‌ స్కూల్లో బుధవారం నిర్వహించిన అండర్‌ 14, అండర్‌ 17 జిల్లా బాలుర బాల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లా స్థాయి జట్టు ఎంపిక పోటీ లను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి వినుకొండ ప్రాంతానికి మం చి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధా న్యత నిస్తూ ప్రోత్సహిస్తోం దన్నారు. విద్యార్థులకు మెరు గైన విద్యను అందించడంతో పాటు క్రీడలకు పెద్దపీట వేసిందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యానికి దోహద పడతాయని అన్నారు.