Jan 17,2022 22:25

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న పుల్యాల నాగిరెడ్డి

ప్రజాశక్తి-పగిడ్యాల : సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంజనేయనగర్‌ గ్రామానికి చెందిన హసన్‌ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో బరక టీమ్‌ లెనిన్‌ జట్టు నిలిచింది. బెస్టు ప్లేయర్‌గా ప్రభు, బెస్టు బౌలర్‌ గోల్డెన్‌ ప్లేమర్‌గా సురేషయాదవ్‌ నిలిచారు. గెలుపొందిన జట్లకు మాజీ జెడ్పిటిసి, వైసిపి నాయకులు పుల్యాల నాగిరెడ్డి, సర్పంచు పెరుమాళ్ళ శేషన్న, శివారెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మోక్షేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఓంకారం, క్రీడాకారులు పాల్గొన్నారు.