Oct 12,2021 17:37

టీ20 క్రికెట్‌ అంటేనే సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద... ఎటువంటి బాలైనా బౌండరీ దాటించడమే లక్ష్యంగా విరుచుకుపడతారు బ్యాట్స్‌మెన్లు. ఈ ఫార్మెట్‌ లో సరిగ్గా ఇలానే ఆడి ఓ కొత్త సిక్సర్ల రారాజుగా అవతరించాడు ఓ ఆటగాడు. యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, ఆండ్రీ రస్సెల్‌, మ్యాక్స్‌వెల్‌ లాంటి అద్భుత ఆటగాళ్లను వెనక్కి నెట్టి... సిక్సర్ల కింగ్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఆ 24 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్‌ ఎవరో కాదు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ అయిన ఫిలిప్స్‌.. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ విషయంపై వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. ''జిమ్‌ చేయడం వల్ల సిక్సర్లు కొట్టే సామర్థ్యం పెరిగింది. ఇది జిమ్‌లో చేసిన కఅషి, క్రికెట్‌పై ఉన్న అవగాహన వల్లే జరిగింది. సిక్సర్లు కొట్టే లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను కూడా అర్ధం చేసుకోవడం నా బలం'' అని పేర్కొన్నాడు.
గ్లెన్‌ ఫిలిప్స్‌ 2021వ సంవత్సరంలో ఇప్పటివరకు 48 మ్యాచ్‌ల్లో ఆడి 89 సిక్సర్లు కొట్టాడు. అలాగే ఈ మ్యాచుల్లో 9 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ లియామ్‌ లివింగ్‌స్టన్‌ 37 ఇన్నింగ్స్‌లలో 82 సిక్సర్లు బాదాడు. 9 మ్యాచ్‌ల్లో 75 సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవిన్‌ లూయిస్‌ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది వెస్టిండీస్‌ ఆటగాడు ఆండ్రీ రస్సెల్‌ 50 సిక్సర్లు కొడితే.. గేల్‌ 41 సిక్సర్లు, మ్యాక్స్‌వెల్‌ 35 సిక్సర్లు కొట్టారు.