
- విద్వేష రాజకీయాలకు చెంప పెట్టు
బెంగళూరు : ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించి సీట్లు గెలుచుకోవడం ద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలును కర్ణాటకలో కాంగ్రెస్ 136 సీట్లు సాధించి తిరుగులేని ఆధిక్యానిు కనబరచింది. 2018 ఎనిుకల్లో కాంగ్రెస్‌కు లభించిన అసెంబ్లీ సీట్లు 80 సీట్లు కాగా, ఈ సారి తన బలానిు గణనీయంగా పెంచుకుంది. గత సారి 104 సీట్లు సాధించిఏన బిజెపి ఈ సారి 65 సీట్లకే పరిమితమైంది. గత సారి 40 సీట్లు సాధించి కింగ్ మేకర్‌గా వ్యవహరించిన జెడి (ఎస్) ఈసారి 19 సీట్లతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది, ఇతరులకునాలుగు సీట్లు దక్కాయి.. ప్రాంతాల వారీగా చూస్తే హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు19, బిజెపికి 9 స్థానాలు లభించాయి. పాత మైసూర్‌లో కాంగ్రెస్‌కు 34, బిజెపికి 5 సీట్లు వచ్చాయి. ఆ ప్రాంతంపై గంపెడాశలు పెట్టుకును జెడి (ఎస్) 14 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ముంబయి కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌కు33, బిజెపికి 16 సీట్లు రాగా, మధ్య కర్ణాటకలో కాంగ్రెస్‌కు 26, బిజెపికి 6 స్థానాలు దక్కాయి. ఒక్క కోస్తా కర్ణాటక ప్రాంతంలో మాత్రం బిజెపి తన ఆధిపత్యానిు నిలుపుకుంది. అక్కడ బిజెపికి 12 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 8 సీట్లు లభించాయి. గ్రేటర్ బెంగళూరులో రెండు పార్టీలకూ చెరో 16 స్థానాలు వచ్చాయి. బసవరాజ్ బమ్మై కేబినెట్‌లోని11 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. మంత్రి సోమను తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు.
గత ఎనిుకలతో పోలిస్తే ఈ ఎనిుకలలో బిజెపి ఓట్ల శాతం (36 శాతం)లో పెద్దగా మార్పు రానప్పటికీ సీట్లను మాత్రం భారీగా కోల్పోయింది. జెడి (ఎస్) కోల్పోయిన ఐదు శాతం ఓట్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు43 శాతం ఓట్లు, జెడి (ఎస్)కు13.3 శాతం ఓట్లు లభించాయి.
కర్ణాటకలో విద్వేషానికి తెర పడిందని, ప్రేమకుద్వారాలు తెరుచుకునాుయనికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనాురు. ప్రేమతోనే ఎనిుకలలో పోరాడామనిచెప్పారు. ఇది దేశానిు ఏకం చేసే విజయమని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు. కర్ణాటక పోరులో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధానిమోడీ శుభాకాంక్షలు చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎనిుకలలో విజయం సాధించడానికి ఈ ఫలితాలు నాంది అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. పార్టీ నేతల ఉమ్మడి కృషి వల్లనే విజయం సాధించామనిఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఈ విజయం గాంధీ కుటుంబానికే అంకితమని పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ తెలిపారు. తన నాయకత్వంపై నమ్మకం ఉంచినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి బమ్మై ఓటమిని అంగీకరించారు. ఓటమికి బాధ్యత వహిస్తునుట్లు చెప్పారు. విజయానికి ఎంతగా కృషి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఫలితాలను విశ్లేషించుకొని, రాబోయే లోక్‌సభ ఎనిుకల కోసం పనిచేస్తామని చెప్పారు. జెడి (ఎస్) నేత కుమారస్వామి కూడా ఓటమిని అంగీకరించారు. గతంలో కూడా తాము పరాజయాలు చవిచూశామని చెప్పుకొచ్చారు.