Oct 28,2021 15:56

కర్నూల్‌ : కర్నూల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన జిల్లాలోని నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో సంభవించింది. అల్లూరులో పెద్ద కుంటలో ఈతకు వెళ్లారు. ఈతకెళ్ళిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. మృతులు విశాల్‌, శరత్‌, మహేష్‌గా గుర్తించారు. విద్యార్థుల మఅతదేహాలను గ్రామస్తులు కుంటలో నుంచి బయటకు తీశారు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.