May 04,2021 13:47

ప్రజాశక్తి-నందిగామ (కృష్ణా) : రెండు రోజుల క్రితం రుద్రవరం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రసాద్‌ కరోనాతో మృతి చెందిన సంఘటన మరవక ముందే... అదే స్కూల్‌లో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు. నందిగామ మండలం రుద్రవరం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందారు. రామకృష్ణ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య, కుమారుడు కూడా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇదే పాఠశాలలో మరో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారినపడి హోం క్వారంటైన్‌లో ఉన్నారు.