Nov 26,2021 11:28

ముంబయి: కరోనా కొత్త వేరియంట్‌ భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాక్ట్‌ మార్కెట్‌ సూచీలు నేల చూపులు చూశాయి. బిఎస్‌పి సెన్సెక్స్‌ 1200 పైగా పాయింట్లు పతనమైంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ (బి. 1.1.529)పై కేంద్రం అలర్ట్‌ చేస్తోంది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1214 పాయింట్ల నష్టంతో 57,554 వద్ద.. నిఫ్టీ 370 పాయింట్ల నష్టంతో 17,116 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద కొనసాగుతోంది. దీంతో రిలయన్స్‌ ఇండ్రస్టీ, హెడ్‌ఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిసిఐ బ్యాంక్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, స్టేట్‌బ్యాంకు షేరు పతనమౌతున్నాయి.