Jan 25,2022 22:07

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి

ప్రజాశక్తి - బత్తలపల్లి : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వాలెంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు గ్రామస్థాయిలో ప్రజలలో అవగాహన కల్పించి మహమ్మారి బారిన పడకుండా చూడాలని ఎంపిపి గుర్రం వనజ శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని చంపెట్ల, గరికల పల్లి పంచాయితీలలో సర్పంచులు కరుణ రామానాయుడు, పద్మావతిల అధ్యక్షతన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు హాజరైన ఎంపిపి మాట్లాడుతూ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో వాలంటీర్ల, సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు. భాగస్వామ్యం కావాలన్నారు. కరోనా కట్టడిలో ప్రజలకు సరైన అవగాహన కల్పించి వారిని మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ దోసిరెడ్డి, వైస్‌ ఎంపిపి వెంగళరెడ్డి, ఎస్‌ఐ శ్రీహర్ష, హౌసింగ్‌ ఎఇ సమీల్‌ అహ్మద్‌ తదితరర మండల స్థాయి అధికారులతో పాటు వైసిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.