Jun 11,2021 21:08

ఎస్‌ఐని సన్మానిస్తున్న వైద్యసిబ్బంది

ప్రజాశక్తి - నందలూరు : 2020 మార్చిలో మొదటి సారిగా విజృంభించిన కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఎస్సై లక్ష్మి ప్రసాద్‌రెడ్డి సేవలు అద్వితీయమని డాక్టర్‌ సృజన అన్నారు. శుక్రవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బదిలీపై వెళ్లిన ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌ రెడ్డిని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ పిల్లిపిచ్చయ్య ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశాలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సృజన మాట్లాడుతూ ఎస్సై లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి కరోనాను కట్టడి చేయడంతో పాటు, చాలామందికి భోజనం సమకూర్చడం, కరోనా సోకి మరణించిన వారికి దహన సంస్కారాలు నిర్వహించి తన ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. కరోనా సమయం లో వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎంతో సహకరించారని అన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ శివరామకష్ణ, వైద్య ఆరోగ్య సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, లక్ష్మయ్య, ఆశాలు, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.