Oct 13,2021 20:59

న్యూఢిల్లీ : కరోనా ముందు నాటి స్థాయితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్‌ అమ్మకాలు 96 శాతానికి చేరాయని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఎఐ) తెలిపింది. 2019 ఇదే మాసంతో పోల్చితే గడిచిన నెలలో అమ్మకాలు బాగానే ఉన్నాయని బుధవారం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాదిలో అమ్మకాలు 33 శాతం, ఈశాన్య ప్రాంతంలో 30 శాతం వృద్థి నమోదయ్యిందని ఆర్‌ఎఐ తన బిజినెస్‌ సర్వే - రౌండ్‌ 20లో పేర్కొంది. వినియోగదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపింది.