Jan 19,2022 09:48

వాషింగ్టన్‌ : మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా పోరుకు, భవిష్యత్‌లో ఇటువంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు బిల్‌గేట్స్‌, ఆయన భార్య మిలిండా గేట్స్‌ 150 మిలియన్‌ డాలర్లను అందించారు. గేట్స్‌ ఫౌండేషన్‌, బ్రిటీష్‌ బయోమెడికల్‌ చారిటీ వెల్‌కమ్‌ సంస్థలు చెరో రూ. 150 మిలియన్‌ డాలర్లు (రూ. 300 మిలియన్‌ డాలర్లు)ను అందించాయి. ఈ మొత్తం.. ఐదేళ్ల క్రితం స్థాపించిన కొల్లినేషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపెడ్‌నెస్‌ ఇన్నోవేషన్‌ (సిఇపిఐ)కి వెళతాయి. ఈ సంస్థకు కోవాక్స్‌ సహ నేతృత్వం వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాక్సిన్‌ కూటమి గవితో పాటు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి కోవిడ్‌ వ్యాక్సిన్లను అందించడంలో ఈ సంస్థ చొరవ చూపిస్తుంది. ఒమిక్రాన్‌ చివరి కరోనా వేరియంట్‌ అవుతుందని ఎవరూ విశ్వసించరని వెల్‌కమ్‌ డైరెక్టర్‌, బ్రిటీష్‌ శ్రాస్తవేత్త జెరెమీ ఫర్రార్‌ తెలిపారు. మాకు ప్రపంచ స్పందన అవసరమని, ప్రభుత్వాలు తమ సహకారాన్ని పెంచాలని కోరారు.