Jun 11,2021 21:32

నిత్యావసర సరుకులు అందిస్తున్న పోలీసులు

గుమ్మలక్ష్మీపురం : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుకు ఆనుకుని ఉన్న పెద్దరావికోన గ్రామంలో 30 మంది గిరిజనులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట సిఐ టివి తిరుపతిరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ శుక్రవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. కరోనా రోగులను గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలోని ఐసోలేషన్‌ కేంద్రానికి 108 వాహనంలో తరలించారు. రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు జగన్నాధ రథో సహకారంతో గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పించి, నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్‌ రాజు, రవి పాల్గొన్నారు.