Mar 02,2021 21:04

ముంబయి: టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ మంగళవారం కరోనా టీకాలు వేయించుకున్నారు. 58ఏళ్ల రవిశాస్త్రి అహ్మదాబాద్‌లోని అపోలో హాస్పటల్స్‌లో, 69ఏళ్ల మదన్‌లాల్‌ న్యూఢిల్లీలోని జీవన్‌ హాస్పటల్‌ మరియు నర్సింగ్‌ హోమ్‌లో తొలి విడత కరోనా టీకాలు వేయించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ట్విటర్‌వేదికగా టీకా వేయించుకున్నందుకు గర్వపడుతున్నామని, సహకరించిన ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరికీ ట్విటర్‌వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

ఐపిఎల్‌ నిర్వహణకు ముంబయి దూరం

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) వేదికల జాబితా నుంచి ముంబయి వైదొలిగింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఐపిఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు దూరంగా ఉండనున్నట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో పేర్కొంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ముంబయి ఇండియన్స్‌ సొంత మైదానం కూడా ఇదే కాగా.. దాని స్థానంలో హైదరాబాద్‌ వచ్చి చేరినట్లు ఓ వెబ్‌సైట్‌ వెల్లడించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలు మాత్రమే ఐపిఎల్‌ రేసులో ఉన్నట్లు తెలిపింది. దీనిపై బిసిసిఐ, ఐపిఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.