Nov 21,2020 19:40

లండన్‌: కరోనాతో కోమాలోకి వెళ్లిన తల్లి.. కళ్లు తెరిచే సరికి పట్టరాని ఆనందంతో, మధురమైన అనుభూతితో కన్నీరు మున్నీరైంది.. అప్పటి వరకూ ఉన్న బాధంతా ఆనందంగా మారిపోయింది.. అసలేం జరిగిందంటే.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన డాక్టర్‌ పర్‌పెచ్యువల్‌ ఉకేకు ఏప్రిల్లో కరోనా సోకింది. అప్పటికే ఆమె గర్భవతి. వైరస్‌ సోకి ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్య విధానాల ద్వారా డాక్టర్లు ఆమెను కోమాలోకి పంపారు. అప్పటి నుండి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు. జూలైలో ఉకేకు డెలివరీ చేయాలి. అయితే, ఉకే కోలుకోవడం ఆలస్యమైతే కడుపులో శిశువులకు ప్రమాదమేమోనని భావించిన వైద్యులు సిజేరియన్‌ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు. ఇటీవలే కోమా నుండి తేరుకున్న ఉకే కళ్లు తెరవగానే కడుపును తడిమి చూశారు. గర్భం ఎత్తుగా లేకపోవడంతో తనకు గర్భస్రావమైందేమోనని భయపడిపోయింది. కొంతసేపటికి ఆమెకు వైద్యులు అసలు విషయం చెప్పారు. తాను జన్మనిచ్చిన ఇద్దరు కవలలను చూపించారు. వారిద్దరినీ చూసిన ఉకేకు ముందు మాటలు రాలేదు. తర్వాత కన్నీళ్లాగలేదు. ఇది నిజంగా ఓ అద్భుతమని ఉకే సంతోషంతో తబ్బిబ్బైపోయారు.