
కర్ణాటక ఎన్నికల ఫలితాలు
- కర్ణాటక ప్రజల తీర్పును గౌరవిస్తున్నా : కుమారస్వామి
కర్ణాటక రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పే అంతిమమైనదని చెప్పారు. గెలుపు, ఓటమిని తాము సమానంగా స్వీకరిస్తామని చెప్పారు. ఈ ఓటమే తమకు ఫైనల్ కాదని అన్నారు. తాము ఎప్పుడూ ప్రజలతోనే ఉంటామని తెలిపారు. ఓటమి తనకు కానీ, తన కుటుంబానికి కానీ కొత్త కాదని కుమారస్వామి అన్నారు. గతంలో తాను, తన తండ్రి దేవెగౌడ, తన సోదరుడు రేవణ్ణ కూడా ఓడిపోయామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కషి చేస్తామని చెప్పారు. అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెపుతున్నానని... నూతన ప్రభుత్వం ప్రజల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
- సోనియా, రాహుల్‌లకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో సోనియా, రాహుల్‌లకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
- సిఎం అభ్యర్థి ఎవరో సోనియా, రాహుల్ నిర్ణయిస్తారు :మల్లికార్జున ఖర్గే
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంశంపై చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ సభ్యులందరూ సాయంత్రంలోగా బెంగళూరుకు రావాలని ఆదేశించామని, ప్రభుత్వ ఏర్పాటుకు తగిన విధానాలను పార్టీ అనుసరిస్తుందని తెలిపారు.
- 108 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో కాంగ్రెస్ భారీ మేజార్టితో ముందుకు దూసకుకుపోతుంది. కాంగ్రెస్ 108 సీట్లు గెలుచుకోగా 23 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 51 స్థానాలలో విజయం సాధించగా 17 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. జెడిఎస్ 16 స్థానాలలో గెలుపొందగా 5 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాలలో గెలుపొందారు.
- బీజేపీపై ప్రజలు విసిగిపోయారు : సిద్ధరామయ్య
బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు ఎన్నికల్లో చాలా ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ శ్రమ ఫలించలేదన్నారు. కాంగ్రెస్‌కు చాలా కీలకమైన ఎన్నికలు ఇవి అని తెలిపిన సిద్ధరామయ్య.. రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్‌కు ఉపకరించిందన్నారు.2018 ఎన్నికల్లోనూ 'ఆపరేషన్ కమలం' జరిగిందని.. గత ఎన్నికల్లో డబ్బులిచ్చి నేతలను కొనుగోలు చేశారని ఆరోపణలు చేశారు. ఏ పార్టీ దేశాన్ని రక్షిస్తుందో ప్రజలకు తెలుసన్నారు. విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరని ఈ సందర్భంగా చెప్పారు.
#WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr
— ANI (@ANI) May 13, 2023
- డీకే శివకుమార్ భావోద్వేగం
విలేకరుల సమావేశంలో కేపీసీసీ చీఫ్ శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని.. మద్దతిచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో కషిచేశారని.. రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నేతలు శ్రమించారని ఈ సందర్భంగా చెప్పారు. సమష్టి కషితో కర్ణాటక ఎన్నికల్లో గెలిచామన్నారు.
- మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయాం :బొమ్మై
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు.'మేం మెజార్టీ మార్క్‌ను సాధించలేకపోయాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా మేమంతా.. పార్టీలో ప్రతి ఒక్కరు ఎంతో ప్రయత్నించినా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయాం' అని బొమ్మై అన్నారు.
VIDEO | Karnataka Election Results 2023: "We have not been able to make the mark, inspite of a lot of efforts put in by everyone, including the PM and the workers. We will do a detailed analysis once the results come. We will take these results in our stride and will reorganise… pic.twitter.com/fhtwkxpuVj
— Press Trust of India (@PTI_News) May 13, 2023
- 50 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 50కి పైగా స్థానాల్లో గెలుపొందింది. 52 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. 22 స్థానాల్లో బీజేపీ.. జేడీఎస్ 5 స్థానాల్లో గెలుపొందింది. రెండు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. కాగా కాంగ్రెస్ 80, బీజేపీ 43, జేడీఎస్ 17, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
- 35 చోట్ల కాంగ్రెస్ విజయం..
మధ్యాహ్నం 12.30 నాటికి కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి 14, చోట్ల జెడిఎస్ 2 చోట్ల గెలుపొందాయి. ఇతరులు 2 సీటుల గెలిచారు.
- 2,700 ఓట్ల మెజారిటీతో గాలి జనార్దన్ రెడ్డి విజయం
గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి.. కేవలం 2,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు 46,031 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారీకి 43,315 ఓట్లు పడ్డాయి.
- చెన్న పట్నంలో కుమారస్వామి విజయం
జేడీఎస్ నాయకుడు కుమారస్వామి విజయం సాధించారు. ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓటమి పాలయ్యారు.
- 130 స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 130 స్థానాల్లో అధిక్యం దిశగా కొనసాగుతోంది. ఏ ఎగ్జిట్ పోల్ ఉంహించని ఉహించని మెజార్టీ దిశగా కాంగ్రెస్ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగెస్ 130, బిజెపి 67, జెడిఎస్ 21, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
- మాజీ సిఎం జగదీశ్ షెట్టర్ ఓటమి
హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్ శెట్టర్ ఓటమి పాలైయ్యారు.
- 29 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు 29 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 11 స్థానాల్లో గెలుపొందగా.. జేడీఎస్ ఒక స్థానంలో విజయం సాధించింది. స్వతంత్రుల్లో ఒకరు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ 93, బీజేపీ 58, జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
- బొమ్మై విజయం
కర్ణటక సిఎం, బిజెపి అభ్యర్థి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
- 12 గంటల వరకు వెలువడిన ఫలితాలు ఇలా..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించి.. మరో 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ నాలుగు చోట్ల గెలిచి 64 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 1 స్థానంలో విజయం సాధించి.. 25 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మరో 7 చోట్ల మందంజలో ఉన్నారు.
- కనకపురాలో డీకే శివకుమర్ గెలుపు
కనకపురా నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ విజయం సాధించారు.
- ఖాతా తెరిచిన మూడు పార్టీలు
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, జెడిఎస్‌లు ఖాతా తెరిచాయి. చల్లకెరెలో కాంగ్రెస్ అభ్యర్థి రఘు మూర్తి గెలుపొందగా.. ఎల్లపురాలో బిజెపి అభ్యర్థి శివరామ్, హసన్‌లో జెడిఎస్ అభ్యర్థి స్వరూప్ గెలుపొందారు.
- 120 స్థానాలకు పైగా గెలుస్తాం : సిద్ధ రామయ్య
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 120 స్థానాలకు పైగా గెలుస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలో మత రాజకీయాలు పని చేయలేదని.. బీజేపీపై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. మాకు ఎవరి మద్దతు అవసరం లేదని.. స్వంతంగానే ప్రభుత్వాని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
- కుమారస్వామితో బీజేపీ నేతల భేటీ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు పొత్తులు, ఎత్తుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 30 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు. జేడీఎస్ చీఫ్ కుమారస్వామితో ఓ హౌటల్‌లో కొందరు బీజేపీ నేతలు భేటీ అయినట్లు సమాచారం.
- ఎమ్మెల్యేలుగా గెలిచే నాయకులు బెంగళూరుకు రండి..: కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ అభ్యర్థులు 70కి పైగా స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా.. గెలిచిన అభ్యర్థులను ఈరోజు బెంగళూరు చేరుకోవాల్సిందిగా కాంగ్రెస్ నాయకత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
- మా నాన్నే సీఎం కావాలి.. సిద్ధరామయ్య కొడుకు
కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుని చూస్తే ముఖ్యమంత్రిగా తన తండ్రి సిద్ధరామయ్యే ఉండాలని కాంగ్రెస్ నేత యతీంద్ర సిద్ధరామయ్య చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సొంతంగానే ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. గత బీజేపీ హయాంలో జరిగిన అవినీతిని సరిచేసే సత్తా తన తండ్రికి మాత్రమే ఉందని యతీంద్ర వివరించారు. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. 70 పై చిలుకు స్థానాలో భాజపా లీడ్‌లో ఉంది. జేడీఎస్ 30 స్థానాల్లో ముందంజలో ఉంది.
- కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కు చేరువైనందున న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. శాసన సభ ఎన్నికలలో పలితాలలో కాంగ్రెస్ పార్టీ 114, బిజెపి 79, జెడిఎస్ 25, ఇతరులు 05 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
#WATCH | Celebrations are underway at AICC HQ in New Delhi as the party inches towards the halfway majority mark in #KarnatakaElectionResults. pic.twitter.com/oY0gefbBw4
— ANI (@ANI) May 13, 2023
- కాంగ్రెస్ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 83 స్థానాల్లో, జేడీఎస్ 27 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఉన్నారు.
- ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటికే 100 స్థానాల్లో దూసుకెళుతోంది. బిజెపి 68, జెడిఎస్ 24 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.
- 8 మంది కర్ణాటక మంత్రులు వెనుకంజలో ఉన్నారు. 113 మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 44 స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో, జేడీఎస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ జోరందుకుంది. 9 గంటల 10 నిముషాల వరకు వచ్చిన కౌంటింగ్‌లో.. కాంగ్రెస్ 104, బిజెపి 79, జెడిఎస్ 19, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం 50 దాటింది. 8 గంటల 40 నిముషాల వరకు వచ్చిన ఫలితాలలో... కాంగ్రెస్ 54, బిజెపి 40, జెడిఎస్ 13, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నెల 10న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిుకల్లో కర్ణాటక చరిత్రలో ఎనుడూ లేనివిధంగా అత్యధికంగా 73.19 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నికల్లో వినియోగించిన ఇవిఎంలను పటిష్ట భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికే ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఫలితాలపై మూడు ప్రధాన పార్టీలూ ఆశాజనకంగా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాలను సాధిస్తామని బిజెపి, కాంగ్రెస్, జెడి(ఎస్) ధీమాగా చెబుతున్నాయి. సిపిఎం నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. 120కిపైగా స్థానాలను కాంగ్రెస్ సాధిస్తుందని అత్యధిక ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. హంగ్ ఏర్పడితే జెడి(ఎస్) ఏ పార్టీకి మద్దతిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది.