Jan 16,2021 10:51

కృష్ణా (గుడ్లవల్లేరు) : కృష్ణా జిల్లాలో ప్రముఖ తమిళ, తెలుగు నటుడు విశాల్‌ విశాల్‌ సందడి చేశాడు. జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలోని డోకిపర్రులో సంక్రాంతిని పురస్కరించుకొని గురువారం కోడి పందేలను తిలకించారు. ముందుగా స్థానిక శ్రీ భూ సమేత వెంకటేవ్వర స్వామి ఆలయాన్ని సందర్శిం పూజలు చేశారు. స్వామి వారి దైనందిని, కాలమానిని ఆలయ నిర్మాత, మేఘా సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం స్థానిక విశ్రాంతి మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన బరిలో కోడి పందేలను తిలకించారు. విశాల్‌ రాకను తెలుసుకొని అధిక సంఖ్యలో అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు. వారికి విశాల్‌ అభివాదం చేశారు.