Oct 18,2020 22:29

శ్రీశైలం 10 గేట్ల ద్వారా నీటి విడుదల

10 గేట్ల ద్వారా నీటి విడుదల
ప్రజాశక్తి-శ్రీశైలం ప్రాజెక్టు: 
శ్రీశైలం జలాశయానికి ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం 4,85,737 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. 10 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తి దిగువ సాగర్‌ కు 4,74,910 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల నుండి 4,42,126 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 43,494, హంద్రీ నుండి 117 క్యూసెక్కుల తో కలిపి జలాశయానికి 4,85,737 క్యూసెక్కుల నీరు చేరుతుంది. శ్రీశైలం నీటిమట్టం 884.60గా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 215 టిఎంసిలకు గాను ప్రస్తుతం 213.4011 టిఎంసిలుగా నమోదయింది. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి హంద్రీ-నీవాకు 1688క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఏడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా గడచిన 24 గంటలలో 12.4 54 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువ సాగర్‌కు 26,661 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.