Jul 29,2021 19:35

CHINASATYAM VIGHAM VADDA NIRASANA

కూచిపూడిలో వెంపటి జయంతి వేడుకలు
ప్రజాశక్తి- మొవ్వ
ప్రముఖ కూచిపూడి నాట్య లెజెండ్‌ పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం 10వ వర్థంతి వేడుకలు గురువారం ఆయన జన్మస్థలమైన కూచిపూడి అగ్రహారంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంపటి చినసత్యం స్మతి సదనంలోని ఆయన విగ్రహానికి నాట్యాచార్యులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటు నాట్యానికి, అటు గ్రామానికి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ శతాబ్దంలో కూచిపూడి నాట్యం దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొంది విస్తత ప్రచారానికి కారణం వెంపటి చిన సత్యం అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాట్యాచార్యులు డాక్టర్‌ చింత రవిబాలకష్ణ, డాక్టర్‌ ఏలేశ్వరపు శ్రీనివాసులు, పసుమర్తి మత్యుంజయ శర్మ,శ్రీ బాలా త్రిపుర సుందరి గ్రంథాలయాధికారి వై వి ఫణికుమార్‌, గ్రామస్తులు మహంకాళిసత్య శ్రీనివాస్‌, పసుమర్తి బాల రామకష్ణ, భాగవతుల రామతారకం, సోమయాజుల మురళీకష్ణ, బోలెం సాంబశివరావు, మురారి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.