Nov 21,2020 15:58

హైదరాబాద్‌: ఊహించిందే జ‌రిగింది.. కాంగ్రెస్ అభ్య‌ర్థి కూన శ్రీనివాస్‌గౌడ్ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్న‌మే ఈ విష‌యం తెలియ‌డంతో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ రిట‌ర్నింగ్ కార్యాల‌యం వ‌ద్దకు చేరుకుని ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో ఆయ‌న‌పై లాఠీఛార్జ్ కూడా జ‌రిగింది. ఈ క్ర‌మంలో గాజుల రామారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.సాయంత్రానికి నామినేష‌న్‌ తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో కాంగ్రెస్ కార్యక‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేసిన‌ట్లు తెలిపారు.