May 16,2022 23:44

రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదుల చేస్తున్న సురేంద్ర, నాయకులు కూరగాయల రైతులను ఆదుకోవాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సురేంద్ర ప్రజాశక్తి ముంచంగిపుట్టు:- వేసవికాలంలో సాగునీరు అందక ఎండిపోయిన మిర్చి, కాకరకాయ, గుమ్మడి, బీన్స్‌, బెండకాయ తదితర కూరగా

ప్రజాశక్తి ముంచంగిపుట్టు:- వేసవికాలంలో సాగునీరు అందక ఎండిపోయిన మిర్చి, కాకరకాయ, గుమ్మడి, బీన్స్‌, బెండకాయ తదితర కూరగాయ పంటలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. మండల కమిటీ సభ్యుడు కె.శంకర్రావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎమ్‌ఎమ్‌ శ్రీను, నాయకులు కె.భీమరాజు, కె.దోంబ్రులతో కలిసి దోడిపుట్‌లో ఎండిపోయిన కూరగాయ తోటలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, గిరిజన కూరగాయల రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు, సబ్సిడీ రుణాలు, వ్యవసాయ పనిముట్లు అందించాలని డిమాండ్‌ చేశారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం మంజూరు చేసి సాగునీరు అందించాలని తెలిపారు. వేసవి కావడంతో ఉటనీరు ఎండి పోవడంతో గ్రామానికి చెందిన సుమారు 15 వందల ఎకరాల్లో వేసి చేతికి వచ్చిన కూరగాయ పంటలు ఎండిపోయి గిరిజన రైతులకు తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు.ఏజెన్సీలోనే కూరగాయ పంటలకు దోడిపుట్‌ ప్రసిద్ధి అని, ఇక్కడనుండే సంతలకు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తుంటారని తెలిపారు. తోటలకు పరిశీలించిన వారిలో రైతులు ఉన్నారు.