
ప్రజాశక్తి - వీరవాసరం
జాతీయ కుస్తీ పోటీల్లో వీరవాసరం ఎస్‌ఎంబిటిఎవి అండ్ ఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలకు చెందిన పాలా బాలాజీ మూడో స్థానం సాధించాడు. బుధవారం బాలాజీని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వర్థినీడి సత్యనారాయణ, ప్రిన్సిపల్ వలవల నరసింహారావు అభినందించారు. బికాం రెండో సంవత్సరం చదువుతున్న బాలాజీ ఇటీవల మహారాష్ట్రలో కొల్హాపూర్ శివాజీ విశ్వవిద్యాలయంలో జరిగిన కుస్తీ పోటీల్లో ఈ కళాశాల నుంచి ఆదికవి నన్నయ్య యూనిర్సిటీ తరుపున పాల్గొన్నాడు. బాలాజీ తమ కళాశాలకు పేరు తీసుకురావడం అభినందనీయమని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిడి చింతా సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.