Feb 06,2023 21:34

అవగాహన ర్యాలీ చేస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి - కురుపాం : కుష్టు వ్యాధి నివారణ పై మొండెంఖల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి హర్ష కుమార్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సోమవారం పాఠశాల విద్యార్థులతో కలిసి మొండెంఖల్‌ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు రాష్ట్రమంతటా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా కుష్టి వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించి కుష్టు వ్యాధి నివారణకు విద్యార్థులు చే ప్రతిజ్ఞ చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎమ్‌ఒ బలరాం నాయుడు, నోడల్‌ ఆఫీసర్‌ ఎ. నాగేశ్వరరావు, ఈవో సెల్వరాజ్‌ ఏఎన్‌ఎంలు ,ఆశ వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.