Oct 03,2022 02:46
ఇంకొల్లులో పేదలకు కుట్టుమిషన్లు అందిస్తున్న రొటేరియన్లు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: రోటరీక్లబ్‌ ఆఫ్‌ ఇంకొల్లు సెంట్రల్‌ ఆధ్వర్యంలో రోటరీగంగ భవనం వద్ద గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి ఘనంగా నిర్వహించారు. రోటరీ జిల్లా 3150 గవర్నర్‌ టి రాజశేఖరరెడ్డి ఆదేశం మేరకు డిస్ట్రిక్ట్‌ డిజిగేటెడ్‌ కార్యక్రమంలో భాగంగా సమాజ ఆర్థికాభివృద్ధి కోసం ఇంకొల్లు గ్రామానికి చెందిన నిరుపేదలైన సయ్యద్‌ గాలీబీ, పాటిబండ్ల లక్ష్మిలకు రూ.14,000 విలువైన రెండు కుట్టుమిషన్లు అందజేశారు. ఒక మిషన్‌కు మద్దినేని హను మంతరావు, షేక్‌ మొహిద్దీన్‌ బాషా, మరో మిషన్‌ను జెట్టి వెంకటేశ్వర్లు (స్వామి), పులఖండం బద్రిరెడ్డి, అలవల శ్రీని వాసరెడ్డిలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులు భవనం అంజిరెడ్డి, కార్యదర్శి కమలేశ్వరరావు, కోశాధికారి శ్రీమన్నారాయణ, సభ్యులు డాక్టర్‌ ఆలా శ్రీకృష్ణమూర్తి, ఘంటా రాజగోపాలరావు, సోమేపల్లి రామమోహనరావు, బెల్లంకొండ వాసుదేవరావు, చుండి సాంబశివరావు, షేక్‌ మస్తాన్‌ బాబా (హన్ను), రాఘవరాజు, పేర్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.