
ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాన్సర్‌ను ఎదుర్కొని బయటపడటం ఓ సవాలే. మానసికంగా కుంగుబాటు, భయంతో జీవిత లక్ష్యం వైపు అడుగులు వేయలేరు. సాధించాలని ఉన్నా... ఆరోగ్యం సహకరించట్లేదని అంతటితో సరిపెట్టుకుంటాం. కానీ అమెరికాలో ఓ యువతి మాత్రం క్యాన్సర్‌ను ఎదుర్కొవడమే కాదు. ఏకంగా అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమైంది.
హెలె ఆర్కెంకో (29) పదేళ్ల వయసులో ఎముకలకు సంబంధించిన క్యాన్సర్ గురైంది. కానీ ఎక్కడ తాను ఓ రోగినని బాధపడలేదు. ఎక్కడా చదువుమీద శ్రద్ధ, పట్టుదల సడలలేదు. అనారోగ్యం రీత్యా ఆమె జీవితంలో కొన్ని నెలలు వృథా అయ్యాయి. శస్త్రచికిత్సలు జరిగాయి. ఎముకల క్యాన్సర్‌తో పోరాడి బతికిన వ్యక్తిగా ఇప్పటికే హెలె గుర్తింపు పొందింది. తన మనసులో జీవితం పట్ల ఉన్న దృఢసంకల్పమే చావుతో కూడా పోరాడేలా చేసింది. అంతరిక్షంలోకి వెళ్లాలని తన కల- ఆ వైపుగా తన చదువు, అన్వేషణ సాగించింది.
ఈ నెలలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. దీన్ని ఈ సంవత్సరం చివరికి నాటికి టేకాఫ్ చేయాలి. ఈ మిషన్‌లో ముఖ్య విభాగంలో హెలె పనిచేస్తుంది. రాకెట్లో అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే సిబ్బందిగా తయారైంది. కొత్త సిబ్బందికి వాణిజ్య వ్యోమగాములుగా శిక్షణ ఇస్తుంది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ సిబ్బందితో కలిసి పనిచేయడానికి సెయింట్ జూడ్ ఆమెకి అవకాశం ఇచ్చింది. ప్రపంచంలో క్యాన్సర్‌ను ఎదుర్కొని అంతరిక్షంలోకి వెళుతున్న వ్యక్తిగా హెలెని అక్కడివారంతా కొనియాడుతున్నారు. ఎంతోమందికి ఆమె ప్రేరణగా నిలుస్తుందని అంటున్నారు.