Aug 18,2022 21:46

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్‌ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ టాక్సి సేవలను ప్రారంభించారు. దీనికోసం కేరళ సవారీ పేరిట ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ టాక్సీ సర్వీసులను నిర్వహించడం దేశంలోనే మొదటిసారి. కేరళ సవారీతో ప్రయాణీకులు, డ్రైవర్లు ఇద్దరికీ మేలు జరుగుతుందని ఈ సందర్భంగా పినరయి అన్నారు. రాష్ట్ర కార్మిక మంత్రి వి.శివన్‌కుట్టి సరళీకరణ ఆర్థిక విధానాలు సంప్రదాయ కార్మిక రంగాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతునాుయని అనాురు. ఈ తరుణలో మోటారు కార్మికులను ఆదుకునేందుకు కార్మిక శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నామని, త్వరలో రాష్ట్రమంతా అమలు చేస్తామని ఆయన తెలిపారు.

  • ఇవీ ప్రత్యేకతలు

. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు యాప్‌లో 'పానిక్‌ బటన్‌'ను అందుబాటులో ఉంచారు. అవసరమైన సందర్భాల్లో ప్రయాణీకులు కానీ, డ్రైవర్‌ కానీ దీనిని వినియోగించవచ్చు. ఆ సమాచారం కంట్రోల్‌రూమ్‌కు చేరి పోలీసులు టాక్సీ వద్దకు వస్తారు.

  • . పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ ఉన్న డ్రైవర్ల వినియోగం

. ప్రస్తుతం వివిధ ఆన్‌లైన్‌ టాక్సీ సర్వీసు ప్రొవైడర్లు ప్రయాణీకుల నుండి వసూలు చేస్తును మొత్తానికి, డ్రైవర్‌కు చెల్లిస్తున్న మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. దీనిని తగ్గించారు. అలాగే రేట్లు అనిు సమయాల్లోనూ ఒకే విధంగా నిర్ణయించారు.
.సర్వీసు ఛార్జీనికూడా కనిష్టంగా నిర్ణయించడంతో ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులతో పోలిస్తే ప్రయాణీకులకు తక్కువ ఛార్జీలకే టాక్సీలు అందుబాటులో ఉంటాయి.  వాహనాలపై ప్రదర్శించే ప్రకటనల ఆదాయంలో 60 శాతం డ్రైవర్లకు ఇస్తారు.