Oct 03,2022 01:20

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : జైలులో ఉన్న ఖైదీల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసు కుంటున్నామని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. గాంధీ జయంతిని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా జరుపు కుంటు న్నామని ఆయన తెలిపారు. స్థానిక జిల్లా జైలులో మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జైలు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని యావత్‌ దేశం మొత్తం పండుగలాగా జరుపుకుంటుందన్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మీరు కారాగారంలో ఉన్నారన్నారు. ఈ క్షణికావేశ నిర్ణయాల వల్ల కుటుంబానికి దూరంగా ఉంటూ మానసికంగా ఇబ్బంది పడు తున్నారన్నారు. జైలు అంటే శిక్ష అనుభవిం చడం కాదని ఖైదీలు పరివర్తన చెంది మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడు తుందన్నారు. అనంతరం నత్య ప్రదర్శన చేసిన విద్యార్థులకు కలెక్టర్‌ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి యు. నాగరాజు, జిల్లా ఆయుష్‌ అధికారి భ్రమరాంబ, రిమ్స్‌ వైద్యులు చైతన్య వర్మ, చీమకుర్తి లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు జవహర్‌ తదితరులు పాల్గొన్నారు.